కాకాని వెంకటరత్నం జీవితం మొత్తం ప్రజల కోసం

ఒక దృవతార రాలిపోయి 50 ఏళ్లు అయినది

విలువలు లేని పార్టీ రాజకీయాలు అనర్థాలన్నిటికీ మూలం అనే విషయం.

బడుగువర్గాలకు అండగా, వారి అణగచివేతకు వ్యతిరేకంగా ఉండడం 


పిల్లలు, యువకుల భవిష్యత్‌ని గురించి ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం


కులమతాలకి అతీతంగా ఆలోచించటమే గాక అందరితో కలిసి పనిచేయటం, అందరికి అవకాశాలు కలుగజేయడం



ఆలోచనలు పది మందితో పంచుకుంటూ మంచిని పెంచుకోటంలోనే వుంది ప్రజాస్వామ్యం

ఎన్నికల్లో గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమం కోరకు ఆలోచించడం


స్థానిక సంస్థల ఏర్పరచటం, అభివృద్ది, కేంద్రీకరణ కాదు, వికేంద్రీకరణే గ్రామాలకు శ్రీరామరక్ష నాంది



వ్యాపార లావాదేవీలు,వ్యకిగత స్వార్ధాలకు పార్టీ రాజకీయాలతో ముడిపెట్టకూడదు,ప్రజాసేవలో వున్న వాళ్లు నైతిక నియమాలు పాటించాలి


ఏ పదవిలో వున్నాం అనే దానికన్నా,పదవి ప్రమాణాలు కాపాడటం ముఖ్యం 

Read More...

కాకాని వెంకటరత్నం సంక్షిప్త జీవిత చరిత్ర

కాకాని వెంకటరత్నం 1900 సంవత్సరం ఆగస్టు మూడో తేదీన జన్మించారు. పూర్వ కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా ఆకునూరు ఆయన జన్మస్థలం. తండ్రి కాకాని చిన తాతయ్య. తల్లి సీతమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. బాల్యంలోనే వెంకటరత్నంలో నాయకత్వ లక్షణాలు కన్పించాయి......

Read More.....

1932 శాసనోల్లంఘన ఉద్యమం-కాకాని వెంకటరత్నం

వెంకటరత్నాన్ని 1932 జూన్ 16న అరెస్టు చేసి రెండేళ్లు తంజావూరు జైల్లో వుంచారు

1932లో మరోసారి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. కాకాని సహచరులు పేటబాపయ్య తదితరులను ఆంధ్రరత్నభవనంలో అరెస్టు చేశారు. ఉద్యమనేతలుగా వారి స్థానంలో కాకుమాను లక్ష్మయ్య, వేదాంతం శంభుశాస్త్రిని నియమించారు.  Read More....

పరిపాలనా దక్షుడు కాకాని

ఓ వైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే,మరోవైపు కాకాని వెంకటరత్నం ప్రజా సమస్యలపై పోరాడారు

1934నుంచి1937వ సంవత్సరం దాకా ఆయన ఆకునూరు సర్పంచ్ గా పనిచేశారు.గ్రామంలో అనేక సదుపాయాలు,సౌకర్యాలు కల్పించారు. 1937లో మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ మంత్రిమండలిలో స్థానిక స్వపరిపాలన మంత్రి బెసవాడ గోపాలరెడ్డిని ఆకునూరుకు ఆహ్వానించి సత్కరించారు.ఈ పరిపాలనానుభవంతో ఆయన భవిష్యత్తులో కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. తర్వాత రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అనుభవం అక్కరకొచ్చింది.

పరిపాలనా దక్షుడు కాకాని

ఓ వైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే,మరోవైపు కాకాని వెంకటరత్నం ప్రజా సమస్యలపై పోరాడారు. 

జిల్లా కాంగ్రెస్ నేతగా... 

1936లో కాకాని వెంకటరత్నం పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజరుగా వ్యవహరించారు. గ్రామగ్రామాన తిరిగి యువతలో స్ఫూర్తినింపారు. జస్టిస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ ను బలోపేతం చేశారు. 

Read More...

మునగాల రైతాంగ పోరాటం

1937 ఎన్నికల్లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రి అయ్యారు. అయ్యదేవర కాళేశ్వరరావు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు Read More..

క్విట్ ఇండియా ఉద్యమం

భారత స్వాతంత్ర్య సమరానికి పతాక ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8 వ తేదీన మహాత్మాగాంధీ ముంబయ్ గోవాలియా టాంక్ మైదానంలో 'డూ ఆర్ డై' అనే నినాదమిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ‘క్విట్ ఇండియా’ అనే నినాదం ఉద్యమనాదం గా దూసుకెళ్లింది. అదేదో ఆషామాషీ నినాదం కాదు. భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షను పదునుగా ప్రతిఫలించిన రణ నినాదం. Read More.. 

1967లో కాకాని వెంకటరత్నం పిసిసి అధ్యక్షులయ్యారు.

ఓ వైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే,మరోవైపు కాకాని వెంకటరత్నం ప్రజా సమస్యలపై పోరాడారు. 

 భారత్ సేవక్ సమాజ్ కన్వీనరుగా సేవలు

 స్వతంత్ర్యాన్యంతరం దేశ పునర్నిర్మాణానికి, మానవవనరుల అభివృద్ధికి భారత్ సేవక్ సమాజ్ ఏర్పాటైంది. అధ్యక్షులుగా కేంద్ర ప్రణాళికా మంత్రి గుల్జారీలాల్ నందా వ్యవహరించారు. ఆంధ్రలో శాఖ ఏర్పాటైంది. సేవక్ సమాజ్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులయ్యారు. సేవక్ సమాజ్ కన్వీనర్ గా ఆయన గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాల్వలు తవ్వించారు. కృష్ణాజిల్లా లో బుడమేరు కరకట్టలు పోయించారు.

Read More...

 ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు

 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారు. 1954లో బెంగాల్ లో కల్యాణి లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి కాకాని హాజరయ్యారు  Read More..

1962లో శాసనసభకు ఎన్నిక

1962లో శాసన సభ ఎన్నికల్లో కాకాని వెంకటరత్నం ఉయ్యూరు జనరల్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డిని తన స్వగ్రామం ఆకునూరుకు తీసుకొచ్చి ఘన సన్మానం చేశారు. కోర్టు తీర్పు మేరకు తర్వాత సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చారు. కాకాని కాసు అంతరంగికులలో ఒకరుగా మారారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంలో కాకాని వెంకటరత్నాన్ని విజయవాడ పురవీధుల్లో ఊరేగించారు.. 

 రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాని వెంకట రత్నం

1968లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికలో కాకాని వెంకట రత్నం గెలిచారు. 1969లో కాసుబ్రహ్మానందరెడ్డి మంత్రిమండలి విస్తరణలో కాకానికి చోటు దక్కింది. . వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమల శాఖల మంత్రి అయ్యారు. కాకాని వెంకటరత్నం మట్టి మనిషి. బంగారు మనిషి. ఉక్కుమనిషి.అన్నింటికంటే మనసున్న మనిషి. అచ్చమైన కృషీవలుడు. వ్యవసాయం అంటే ప్రాణం.

For More....